ఇచ్చోడ ఆటో యూనియన్ నూతన కార్యవర్గానికి సన్మానం
*సన్మానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆటో యూనియన్ కార్యవర్గం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన హుస్సేన్ ని అభినందించారు.

