ఈ నెల 11న మంత్రి జూపల్లి పర్యటన
చిత్రం న్యూస్, నేరడిగొండ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ను కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. మంత్రితో భేటీ తర్వాత ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 11న ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉదయం హైదరాబాద్ నుండి నేరుగా బోథ్ మండలానికి 9:30కు చేరుకొని బోథ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ళు ప్రారంభిస్తారన్నారు. బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్స్ లో పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు పథకాలు అందిస్తారని , సొనాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని ఆడే గజేందర్ తెలిపారు. తర్వాత అక్కడినుంచి నేరుగా భోరజ్ మండలంలోని పిప్పర్వాడ, గిమ్మ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.




