శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయాలని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పాటిల్ కు కీర్గుల్ (కె) గ్రామస్తుల వినతి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్ ను బాసర మండలంలోని కీర్గుల్ (కె) గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు .తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ నిర్మాణం కోసం రూ.28 లక్షల టెండర్ పూరయ్యిందని, 5.60లక్షలు. డిపాజిజిట్ కూడా చెయ్యడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు అది ప్రోసెసింగ్ లో నే ఉందని అప్రూవల్ చేయించాలని గ్రామస్తులు ఆయన్ను కోర సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. శ్రీ రామాలయం టెండర్ ప్రొసీడింగ్ ని వెంటనే అప్రూవల్ చేయాలని అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే, ముత్యం రెడ్డి, అట్టల్ దేవిదాస్, వీడీసీ కమిటీ అధ్యక్షులు గోపాల్, వీడీసీ సభ్యులు పల్లె రమేష్, వెంకట్ రావు పాటిల్. రాజేందర్ మాజీ సర్పంచ్ దేవేందర్, జాదవ్ చంద్రకాంత్, పెద్ద కాపు గంగాధర్, మలేగాం సురేష్, పోశెట్టి, గంగాధర్, మాగం గంగన్న, శివన్న అగ్గోళ్ల, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.



