ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
*సాంగిడి గ్రామంలో సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి చికిత్స
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో శ్రీ మోతీజే మహారాజ్ ఆలయంలో L V ప్రసాద్ వారి సౌజన్యంతో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రజలందరూ ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాగా కంటి చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు తమ L V ప్రసాద్ ఆసుపత్రికి రావాలని సూచించారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఎందరో మంది కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారనే ఉద్దేశ్యంతో L V ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కంటి శస్త్ర చికిత్స చేయాలంటే నేడు వేల రూపాయలు ఖర్చు చేసేంత స్తోమత లేని పేదలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ శిబిరానికి సహకరించిన L V ప్రసాద్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ప్రణయ్, వెంకట్ రమణ, సాయిలుకు, గ్రామస్తులతో పాటు ఆయన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో అవసరమైన వారికీ కళ్ళ అద్దాలు, ఉచిత మందులు, ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్స కూడా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సామ నర్సారెడ్డి, దయాకర్ పటేల్, సుధాకర్, మేకల జితేందర్, మంచికంటి సాయి, దేవన్న, జగదీష్ రెడ్డి, రాంరెడ్డి, సతీష్ తదితరులు ఉన్నారు.




