రెడ్డి బాలల గణేష్ మండలిలో మంగళ హారతులతో మహిళల ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి బాలల గణేష్ మండలి వద్ద శుక్రవారం పదో రోజు విశేషంగా పూజలందుకున్నాడు. మహిళలు ఓకే రంగు దుస్తులు ధరించి మంగళ హారతులతో గణనాథునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కాలనీవాసులు అందరూ కలిసి గణనాథునికి పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులు ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. కుంకుమ పూజ నిర్వహించారు. సకల శుభాలు కలగాలని మహిళలందరూ మంగళ హారతులతో ప్రత్యేక పూజలు చేస్తూ, పాటలు పాడుతూ ఆ దేవ దేవుణ్ణి వేడుకున్నారు.




