భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాలతో సిర్సన్న శివ మార్కండేయ స్వామి గణేష్ మండలం నిర్వహించింది. యువతకు ఆధ్యాత్మిక మార్గాలను ప్రోత్సహించడం,శబ్ద కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా భజనలు, సంకీర్తనల మధ్య నిమజ్జనం నిర్వహించారు. మహిళలు, భక్తులు, గ్రామస్తులు భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపును నిర్వహించారు. ఆనందోత్సాహాల నడుమ వినాయకుణ్ణి నిమజ్జనం చేశారు. గణపయ్యా.. మళ్ళీ రావయ్యా..అంటూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో బేత రాఘవేంద్ర, రూపేష్, తుమ్మల సత్తు రెడ్డి,సతీష్, సాహిల్, గణేష్, సంతోష్, రాకేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

