సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులకు ఘనంగా సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలను గుర్తించి ఆదిలాబాద్ పట్టణంలోని అగ్రజ టౌన్ షిప్ లో జిల్లా రెడ్డి సంఘం నెలకొల్పిన గణేష్ మండలికి సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. మండపానికి చేరుకున్న సభ్యులు విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి , ప్రధాన కార్యదర్శి సూర్యకాంత్ , ఉపాధ్యక్షులు రేణికుంట రవీందర్, నాంపల్లి నర్సింలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి , యువజన సంఘం అధ్యక్షులు శివ ప్రసాద్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి స్వప్నిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



