వినాయక మండపాలను దర్శించుకున్న బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్
చిత్రం న్యూస్, బోథ్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రంలోనీ మున్నూరు కాపు సంఘం, శ్రీ చైతన్య గణేష్, ఫ్రెండ్స్ గణేష్ మండపాలను బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మున్నూరుకాపు గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం సభ్యులు, బీఆర్ ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షుడు బోడ్డు శ్రీనివాస్, బోథ్ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, ఆడేపు శ్రీనివాస్, గంగమల్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.