వానరానికి అంత్యక్రియలు
*మానవత్వం చాటుకున్న యువకులు
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో కుక్క దాడిలో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు ధర్మమైన ఆలోచనతో కుక్కల దాడిలో మరణించిన ఓ వానారానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఓ మనిషి మరణిస్తే ఎలా అంత్యక్రియలు చేస్తారో అలా వానరానికి కుంకుమ, పూలతో అలకరించి భజన ,బ్యాండ్ భాజాలతో, మంత్రాలతో సాగనంపుతూ అంత్యక్రియలు పూర్తి చేశారు. మానవత్వం చాటారు. దేగాంలో మృతి చెందిన కోతికి గోటా ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు చేసిన మంచి పనికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.