పంట నష్ట పరిహారం అందజేయాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ : పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని రైతులు కోరారు. గత యాసంగి ఫిబ్రవరిలో కురిసిన అకాల వర్షాల వల్ల 24, 25 తేదీల్లో మొక్కజొన్న నువ్వులు, జొన్న పంట గాలివానకు నేల మట్టం కాగా నేరడిగొండ వ్యవసాయ అధికారిణి( AO) కృష్ణవేణి, ఏఈవో రాథోడ్ వినోద్ లు పంట నష్టం అంచనాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇప్పటికి నష్టపరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదకు గురైనటువంటి నష్ట పరిహారంతోపాటు యాసంగి పంట మొక్కజొన్న, నువ్వులు, జొన్న పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు బాద వెంకటరమణ, సుమిత్ రెడ్డి, రాజశేఖర్, లింగేష్, ప్రమోద్, వినోద్, సంతోష్ ఉన్నారు.




