ఘనంగా బాలల గణేష్ మండలి గణనాథునికి పూజలు
*51రకాల ప్రసాదాలతో రెడ్డి కాలనీ గణపతికి నైవేద్యాలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన గణేషుని ప్రతిమకు భక్తులు, కాలనీవాసులు పూజలు నిర్వహించారు. గత ఏడు రోజులుగా లంబోదరుడు ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. మంగళవారం భక్తులు 51 రకాల ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించారు. అగ్రజుడైన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గం గణపతయే నమః అంటూ సల్లంగా చూడాలంటూ ఆ దేవ దేవుని కొలిచారు. చిన్నపిల్లలు, మహిళలు, యువతీ యువకులతో మండప ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.