ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి కలిసిన నాయకులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా ఇం ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం హైదరాబాద్ లో మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. మండలంలో చేపట్టవలసిన పలు ముఖ్యమైన అభివృద్ధి పనులకు నిధుల మంజూరు విషయమై మంత్రిని కలిసినట్లు రాందాస్ నాక్లే తెలిపారు. ఆయన వెంట నాయకులు మినక సుధాంరెడ్డి, భేదొడ్కర్ అవినాష్, వైద్య జ్ఞానేశ్వర్,ఠాక్రె సాగర్ తదితరులు ఉన్నారు.