మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి పరామర్శ
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు మాతృమూర్తి గంగుబాయి అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతిచెందింది. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి దర్మోరలో ఆంజనేయులు మాతృ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. మృతికి గల కారణాలను ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. దైర్యం చెప్పారు. వారి వెంట ముథోల్ ఆత్మ ఛైర్మన్ గన్ను నర్సారెడ్డి,PACS చైర్మన్ రత్నాకర్ రావు, లోకేశ్వరం మండల మాజీ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లోకేశ్వరం మండల అధ్యక్షులు శ్రీ గడ్డం సుదర్శన్ రెడ్డి, ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ యూత్ అద్యక్షులు షఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్, ఆర్ష ప్రసాద్ తదితరులు ఉన్నారు.