ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.18 వేలుగా నిర్ణయించి, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పోచన్న, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.