ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
చిత్రం న్యూస్, నేరడిగొండ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా జీవితాల్లో అమూల్యమైన మార్పులు తీసుకొచ్చాయని ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ,, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడీడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మా మహేందర్, ఇచ్చోడ మాజీ ఎంపీటీసీ జాహిద్, సీనియర్ నాయకులు బొజ్జా సాయన్న, ఆసిఫ్ ఖాన్, మురళి గౌడ్, రమేష్, భీమరాజ్ గౌడ్, యండి సద్దాం, మౌలానా, కేవల్, శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.