బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
చిత్రం న్యూస్, నేరడిగొండ: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బోథ్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలో BRS పార్టీ మండల కన్వీనర్ శివ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం అచ్చా హై అనే నినాదంతో నేరడిగొండ మండలం దద్దరిల్లింది. అనంతరం మండల కన్వీనర్ శివ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం మానేసుకుని నిజాలు ఒప్పుకోవాలి అని అన్నారు. ఏదైతే జస్టిస్ ఘోష్ రిపోర్టు మొత్తం తప్పుల తడకగా ఉంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వర ప్రదాయిని అని అన్నారు. మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కావాలనే బురద జల్లడానికే అసెంబ్లీ పెట్టారు. కానీ ప్రజలకు వరదల పట్ల ఈ ప్రభుత్వం ఏ మాత్రం భరోసా కల్పించలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, పార్టీ నాయకులు సాబ్లె సంతోష్.మాజీ జడ్పీటీసీ డాక్టర్ జహీర్, వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, VDC అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అనిల్ అన్న యువ సైన్యం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ సాబ్లే నానక్ సింగ్ ,ప్రతాప్ సింగ్, గులాబ్ సింగ్, EX MPTC రవీందర్, గోపు అనిల్ యాదవ్ ,విశాల్, ఆడేళ్ళు, లక్ష్మన్, బాబులాల్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, రాజశేఖర్, శ్రీను, విలాస్, పాండు, రాజు యాదవ్, సుజిల్ జాదవ్, ఆడే కైలాష్, బంసి తదితరులు పాల్గొన్నారు.