ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
*విఠల్-రుక్మిణి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆఖరి పూజ అందుకున్న గణనాథుడు
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మంగళవారం గణనాథుడు ఆఖరి పూజలు అందుకున్నాడు. విఠల్-రుక్మిణి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేషుడికి అగ్గ మనోజ్ యాదవ్ బిజెపి యువ నాయకులు, బుర్రి దత్తు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజులుగా పూజలందుకున్న వినాయకుని నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మండలి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. విఠల్ -రుక్మిణి గణేష్ మండప నిర్వాహకులు అక్షయ్ రెడ్డి ఆకాష్, అజయ్, సాయిరెడ్డి, విష్ణువర్ధన్, రామ్ రెడ్డి, వికాంత్, యువకులు తదితరులు పాల్గొన్నారు.