బీజేపీ నాయకుల నిరసన
చిత్రం న్యూస్, నేరడిగొండ :ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌక్ లో బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ చిత్రపటాలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తీవ్రమైన నిరసనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, అడెపు రమేష్, సురేష్, ఉత్తమ్ సింగ్, ప్రధాన కార్యదర్శి రంజిత్, కార్యదర్శి భీం రావ్, మాజీ ఎంపీటీసీ దుర్వ రాజు, శ్రీధర్ రెడ్డి,అంత్రం భీంరావ్, విలాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.