చిత్రం న్యూస్, నేరడిగొండ :
రాహుల్ గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్
*సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
రిజర్వేషన్ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ క్షీరాభిషేకం చేశారు. సిరికొండ మండల కేంద్రంతో పాటు పొన్న ఎక్స్ రోడ్డు వద్ద సంబరాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ..ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు వారి వాటా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణలో నెరవేరబోతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని ఆడే గజేందర్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా తెలంగాణ నుండి అడుగులు పడతాయని, కాంగ్రెస్ పార్టీ దీని కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.