Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

ఘనంగా గణపయ్యకు వీడ్కోలు 

 అంబరాన్నంటిన నిమజ్జన వేడుకలు

కనుల పండువగా శోభాయాత్ర

అడుగడుగునా భక్తుల నీరాజనం

దారి పొడవునా నృత్యాల హోరు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్( కె) గ్రామంలో ఈ సంవత్సరం పెద్దలు వీడీసీ నిర్ణయంతో ఊరిలో ఒకే గణపతి కూర్చోబెట్టి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు ఆదివారం భక్తులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కనుల పండువగా శోభాయాత్ర నిర్వహించారు. దారి పొడవునా డప్పు చప్పుళ్లు, నృత్యాల హోరుతో వైభవంగా సాగిన వినాయక నిమజ్జనంలో అడుగడుగునా గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణపతి జై జై గణపతి, గణపతి బొప్ప మోరియా ఆదాలడ్డూ కాలియా అంటూ భక్తులు, యువతీ యువకుల నినాదాలు మిన్నంటగా  ప్రత్యేక డీజే చప్పుళ్ల నడుమ అతివల కోలాటం, చిన్నారుల కేరింతల నడుమ విఘ్నేశుడిని వాగులు, చెరువులు, బావుల్లో నిమజ్జనం చేసి ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments