అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
చిత్రం న్యూస్, బేల: ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో పనిచేసేవారికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఎంపీ గోడo నగేష్ అన్నారు. మండలంలోని మారుతి గూడగిరిజన పాఠశాలలో పనిచేస్తున్న మెస్రం వాసుదేవ్ ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. స్థానిక గణేష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎంపీ హాజరై ఆయన్ను సన్మానించారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే ఆదివాసుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవా సమితి నేతలు మాడవి రాజు, కోరంగే దౌలత్ రావు, చంపెల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నీలకంఠ, వివిధ పార్టీల నాయకులు,ఆదివాసీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.