భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం శాసనసభ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలంతా కష్టాల్లో ఉంటే శాసనసభలో నష్టం పై చర్చించకుండా ఇతర బిల్లులపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. ముథోల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని...