బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్
ఉత్తర్వులు జారీచేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. గతం నుండి ఆలయ ఇంచార్జి ఈఓగా కీసర గుట్ట ఈఓ సుధాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇంచార్జి పాలనతో ఆలయ పర్యవేక్షణ లోపంతో అభివృద్ధిపై ప్రభావం పడింది. పాలన కుడా గాడి తప్పిందన్న విమర్శలు లేకపోలేదు. దీంతో ఆలయ అభివృద్ధి కోసం స్పెషల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారిని నియమించాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండేది. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చొరవ చూపి ఆలయ అభివృద్ధి కోసం భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. దీంతో బాసర ఆలయ అభివృద్ధి పారదర్శకంతో పాటు, ఆలయ ఉద్యోగుల విధి నిర్వహణపై నిఘాతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారన్న ,అభిప్రాయం స్థానికులు, భక్తులు వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ నియామకం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.