ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు
రెడ్డి కాలనీలో సామూహికంగా మహిళల ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెడ్డి కాలనీలో ఈ గణనాథుని ప్రతిమ కొలువుదీరింది. ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.
ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ విశేషంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల పూజలతో మండపంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి రోజూ వినాయకుని భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ రోజుకో కొత్త కార్యక్రమాన్ని నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు.