చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి
చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నోటుబుక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మా ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజరావు, కొడప అరుణ్, విశాల్ గోడే,ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.