అన్నదాతకు అన్ని ‘కష్టాలే ‘
చేతికొచ్చిన పంట నీట పాలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో నీట మునిగిన పంటలను చూసి రైతులు లబోదిబోమని అంటున్నారు. అతి భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి నది ప్రవాహంతో పత్తి, సోయా,వరి, కూరగాయలు, వివిధ రకాల పంటలన్నీ చేతికొచ్చే సమాయానికి గోదావరి వరదనీటితో నిండా మునిగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు నీట మునగడంతో అప్పులపాలై పోయామని అన్నదాతలు రావుల పోతన్న, నాగనాథ్, నవీన్, మనోహర్, అగొల్ల పోతున్న, లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.