Chitram news
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 11:46 am Editor : Chitram news

అదుపుతప్పితే ప్రాణాలకే ముప్పు

అదుపుతప్పితే ప్రాణాలకే ముప్పు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ  మండలం కుప్టి గ్రామం నుంచి కౌట గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బీ రోడ్డు ప్రమడకరంగా మారింది. స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాలతో 24 గంటలు రద్దీగా ఉండే  ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్లపైకి రావడంతో  ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ఇరుకైన రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజుకు ఒక ఆక్సిడెంట్ జరుగుతుండడoతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో కాలినడకన రైతులు పొలాలకు వెళ్లాలంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలతో  ఎక్కడ ఏ ప్రమాదo జరుగుతుందోనని  వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఇకనైనా ఇరువైపులా పొదలను తొలగించాలని, ప్రమాదం జరుగుతున్న ప్రదేశంలో కల్వర్టు నిర్మాణం చేపట్టి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.