డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా
చిత్రం న్యూస్, పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం పట్టణంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచినట్లు పెద్దాపురం ఎస్సై వి. మౌనిక తెలిపారు .ఈ మేరకు గురువారం పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. ఈ గణపతి నవరాతరులు పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టినట్లు ఎస్సై వి. మౌనిక వెల్లడించారు.