వాగులో వ్యక్తి గల్లంతు..కాపాడిన అధికారులు, గ్రామస్తులు
చిత్రం న్యూస్ నేరడిగొండ: వాగులో చిక్కుకున్న వ్యక్తి గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కుప్టి, కుమారి మధ్యలో గల చిన్న వాగుపై భారీగా వరద నీరు రావడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. పొదల్లో ఇరుక్కున్న వ్యక్తిని గమనించిన ప్రజలు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మండల సిబ్బందిని తీసుకొని ప్రమాద స్థలానికి వచ్చి కుప్టి, కుమారి యువకులు గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్ తో కలిసి తాడు సహాయంతో వ్యక్తిని కాపాడారు. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి సారంగాపూర్ మండలం దుప్పనాయక్ తండాకు చెందిన జాదవ్ సంజుగా గుర్తించారు ఎమ్మార్వో కలీంతో కుప్టి కుమారి గ్రామస్తులు మాట్లాడుతూ.. చిన్న వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బందులకు గురవుతున్నామని బోథ్ ఎక్స్ రోడ్ ప్రాంతంలో గల ఫారెస్ట్ వారు పార్కు చుట్టుపక్కల నుండి వస్తున్నటువంటి నీటిని కాలువల ద్వారా ఈ ప్రదేశానికి నీటిని వదలడంతో నీరు ఎక్కువగా వస్తుందని.. ఇదివరకే ఇదే ప్రదేశంలో కుచులపూర్ కు చెందిన వ్యక్తి స్వామి మూడు సంవత్సరాల క్రితం మరణించాడని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలం ఇబ్బందులకు గురవుతున్నామని, ఇకనైనా అధికారులు ఈ యొక్క కల్వర్టుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్తులు కోరారు. ఇందులో ఎమ్మార్వో ఎండి కలీం ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఎంపీడీవో ఎస్. శేఖర్ ఆర్ఐ నాగోరావ్, కుమారి పంచాయతీ కార్యదర్శి సిండే దత్తాద్రి, జూనియర్ అసిస్టెంట్, కారోబార్ రాజు, కుప్టి కుమారి, యువకులు ఉన్నారు.