ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
*ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న నేతలు, రైతులు
చిత్రం న్యూస్, భైంసా: సిరాల ప్రాజెక్టు వద్ద ముథోల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని మెప్పించి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు తెచ్చి సిరాల ప్రాజెక్టు పూర్తి చేయించినందుకు కృతజ్ఞతా భావంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఆయన చిత్రపటానికి ఆయకట్టుదారులు, రైతులు, బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పటేల్ మూలంగా ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, నాయకులు కిష్టయ్య, చంద్రకాంత్ పటేల్, బాలాజీ పటేల్, ఎల్లప్ప, భోజరాం పటేల్, బండు పటేల్, గంగారాం, గంగాధర్ మహిళా నాయకులు శారదా, విజయ లక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
,