బోథ్ ఎమ్మెల్యే పరామర్శ
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన రాథోడ్ బిక్కు నాయక్ ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. బిక్కు నాయక్ మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ పవన్, నాయకులు నానక్ సింగ్, రవీందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, దేవేందర్ రెడ్డి, గులాబ్ తదితరులు ఉన్నారు.