ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దారి మళ్లింపు
చిత్రం న్యూస్, నేరడిగొండ :జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల మయం అవ్వడం తో ఆదిలాబాద్ నుండి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ లోని కొండాపూర్ బ్రిడ్జి నుండి ఎడమ వైపు కి దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల తెలిపారు. కొండాపూర్ నుండి వయా మామడ, ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్ళవచ్చని ఆమె తెలిపారు.