బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డికి సన్మానం
చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్, విలన్స్ యూత్ సభ్యులు బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డికి మంగళవారం సన్మానం చేశారు. గ్రామంలో తన సొంత డబ్బులు వెచ్చించి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి అందజేశారు. వినాయక ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు.