వినాయక మండపాల దగ్గర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
చిత్రం న్యూస్, నేరడిగొండ :
వినాయక చవితి వస్తున్న సందర్భంగా మండలంలోని వినాయక మండపాల గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో శేఖర్, తహసీల్దార్ కలీం ,ఎస్సై ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలు విషయాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, ఏమైనా సమస్యలు ఉంటే అప్రమత్తంగా ఉంటూ పరిష్కరించాలన్నారు. మండపాలలో విద్యుత్ మరమ్మత్తులు జరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాలని ఎస్సై ఇమ్రాన్ ఖాన్ అన్నారు. శాంతియుతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.