ప్రశాంతంగా పండగలు నిర్వహించాలి
*శాంతి సమావేశంలో సీఐ సాయినాథ్
చిత్రం న్యూస్ బేల:
ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండగలు నిర్వహించాలని సీఐ సాయినాథ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్నట్లు తెలిపారు. పెద్ద విగ్ర హాలు పెట్టే మండపాల నిర్వాహకులు క్రేన్ల సహాయంతో ముందుకు సాగాలన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో కరెంట్ వైర్స్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు. మండపంలో తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మకూడదన్నారు. నిమజ్జన వేడుక అందరూ ఒకేరోజు నిర్వహించాలన్నారు. మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న పోలీసులకు సమాచారమిస్తే పరిష్కరిస్తామని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతులు రాలేదన్నారు. మహారాష్ట్ర డీజేలకు ఎలాంటి అనుమతి లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సై మధు కృష్ణ,ఏఎస్ఐ జీవన్, కానిస్టేబుల్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు