ఉపాధ్యాయుడు కరీం అన్సారీ (ఫైల్ ఫొ టో)
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి
చిత్రం న్యూస్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి ప్రాథమికోన్నత పాఠశాల బయో సైన్స్ ఉపాధ్యాయుడు కరీం అన్సారీ సోమవారం సాయంత్రం హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన కరీం అన్సారీ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గుండె నొప్పి ఎక్కువ కావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.