కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
*వరదలతో నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి *ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండల నాయకులు భోరజ్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.353 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు. [video width="848" height="478"...