*వరదలతో నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
*ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్
చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండల నాయకులు భోరజ్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.353 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు అమలు ఇస్తామని హామీ ఇచ్చి, వాటిని అమలు చేయలేదని, రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు, పంట నష్టాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఇంక భారీ ఎత్తున నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి జైనథ్, భోరజ్ మండలాల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, గాజుల సన్నీ, బీజేపి మాజీ జైనథ్ మండల అధ్యక్షులు కట్కం రాందాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, నాయకులు సీతారాం, సూర్య రెడ్డి, రాకేష్ రెడ్డి, తోట రమేష్, మహేందర్, వెంకన్న, సురేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.