అనాధ ఆశ్రమంలో ఉచితంగా ఫ్యాన్లు అందజేస్తున్న బృహస్పతి-ధనలక్ష్మి దంపతులు
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన బృహస్పతి -ధనలక్ష్మి దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. KNR కాలనీలోని వృద్ధులకు వారి అవసరాలు తెలుసుకొని ఉచితంగా ఫ్యాన్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజులు, పుట్టిన రోజులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి పేదలకు తోడ్పడాలని వారు పేర్కొన్నారు.