బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న బలిరాం జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి సురేందర్, రాకేష్ ల సోదరుడు లస్మన్న ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బలిరాం జాదవ్ మృతిని నివాసానికి వచ్చి వృత్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట నేరడిగొండ మండలం బీజేపీ కన్వీనర్ ఆకుల రాజశేఖర్, ప్రశాంత్, భోజన్న, సీతన్న, పార్ల సాయన్న తదితరులు ఉన్నారు.