దేవిదాస్ ను సన్మానిస్తున్న మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు సేవా పథకం అవార్డు అందుకున్న ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ను మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు సన్మానించారు. ఆదివారం దేవిదాస్ స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టీ) గ్రామానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, కోశాధికారి దంతుల మధు, సభ్యులు బొల్లు ఈశ్వర్ దాస్, జిమ్మా అడెల్లు, వడ్డి రవికాంత్, గ్రామ మున్నూరుకాపు సంఘం నాయకులు, గ్రామస్తులు గౌరు రమేష్, లంక సుదర్శన్, చిందం పెద్ద పోశెట్టి, చిందం నడిపి పోశెట్టి, అవినాష్, సాయిరాం తదితరులు ఉన్నారు.