బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్ రాజు కు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇటీవలే హార్డ్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రాథోడ్ రాజు ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సజన్, దేవేందర్ రెడ్డి, సురేందర్ రాథోడ్, స్థానిక మాజీ సర్పంచ్ విలాస్, ఉత్తం, మహేందర్, జక్కశ్రీధర్ రెడ్డి, అనిల్ యాదవ్, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.