*ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ కుమార్తె నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మినీ తనీషా ఫంక్షన్ హాల్‌లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్_ హిమబిందు దంపతుల కుమార్తె నామకరణం కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించి, తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో కూడిన సుఖసంతోషమయ జీవితాన్ని కలగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నలిమేల నవీన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.