పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలి
చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామపంచాయతీలో గల గాంధారి శివారంలో కడెం వాగు కింద పంట కోతకు గురైన పత్తి, సోయా, మొక్కజొన్న తదితర పంటలను అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ శివకుమార్ పంట నష్టపోయిన రైతులతో కలిసి సర్వే చేశారు. కుమారి వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ అసిస్టెంట్ టెక్నాలజీ శివకుమార్ తో మాట్లాడుతూ..పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వీరి వెంట రైతులు అగ్గు రమేష్. మండల ప్రవీణ్, వొర్స వివేక్, బిక్క అడేళ్ళు, జడల అభిలాష్, తుమ్మ రాకేష్, బిక్క అశోక్ తదితరులు పాల్గొన్నారు