Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

రెడ్డి హాస్టల్లో ఘనంగా రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు

రెడ్డి హాస్టల్లో రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రెడ్డి సంఘం నేతలు

        చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో రాజా బహదూర్ వెంకట రాం రెడ్డి (rbvrr) జయంతి వేడుకలను సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి  మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితమే చదువు యొక్క ఆవశ్యకతను గుర్తించి చదువుతోనే పేదరికం పోతుందని ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున హాస్టల్ నెలకొల్పి ఎందరో రెడ్డి బంధువులకు విద్యను అందించడం జరుగుతోందన్నారు. రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రెడ్డి హాస్టల్ ప్రారంభించి రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా వసతి సౌకర్యంతో పాటు విద్యా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులు వచ్చే సంవత్సరం నుంచి మన రెడ్డి హాస్టల్ సేవలను రెడ్డి బంధువులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ..రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ సంవత్సరం ఆదిలాబాద్ లో కూడా రెడ్డి హాస్టల్ నెలకొల్పుకొని రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను చేర్చుకొని వారందరికీ ఉచితంగా వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి చేయూతనందిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. వచ్చే సంవత్సరం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో గల రెడ్డి బంధువులు వారి వారి గ్రామాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను హాస్టల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వహణ కమిటీ సభ్యులు అల్లూరి భూమారెడ్డి, గోపిడి సతీష్ రెడ్డి, మినక జలంధర్ రెడ్డి, గోక సాగర్ రెడ్డి, బద్దం దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments