పాపన్న గౌడ్ సేవలు చిరస్మరణీయం *ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, ముథోల్:
బహుజన రాజ్య స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం ముథోల్ పట్టణంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ పోరాట పటిమ, త్యాగం ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయమని, ఆ మహనీయుని ఆలోచనలను అందరూ ఆచరణలో పెట్టాలని పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్ కులస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.