* నిర్మల్ అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో తక్కువ ఖర్చుతో మోకాలి మార్పిడి చికిత్స (Knee Replacement Surgery)
*విజయవంతంగా ఆపరేషన్ చేసిన డా. అరుణ్ కుమార్ రెడ్డి
చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లేన్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అరుదైన మోకాలి చిప్ప ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. హైదరాబాద్, నాగపూర్ లాంటి పెద్ద పట్టణాల్లో మాత్రమే జరిగే ఈ ఆపరేషన్ ను డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు. లక్ష్మణచందా గ్రామానికి చెందిన శంకర్ కు గతంలో మోకాలి చిప్ప అరిగిపోయి నడవడానికి ఇబ్బంది పడడంతో హైదరాబాద్ లో కుడి మోకాలి మార్పిడి చికిత్స చేసుకున్నాడు. అక్కడ భారీ మొత్తంలో ఖర్చు అయ్యింది. ఆ తరువాత మళ్ళీ ఎడమ కాలు కూడా నొప్పితో నడవలేని స్థితికి రావడంతో హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్ లో ఉన్న అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అదే మోకాలి మార్పిడి ఆపరేషన్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్నారని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. మిత్రుడి సలహా మేరకు హైదరాబాద్ వెళ్లకుండా అక్కడ లభించే కార్పొరేట్ హాస్పిటల్ సేవలు నిర్మల్ లోని అరుణ్ రెడ్డి హాస్పిటల్ లో అందిస్తున్నారని తెలుసుకొని వైదున్ని కలిశారు. శంకర్ కు డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసి పేషెంట్ ను నడిపించారు. చాలా ఖర్చుతో కూడిన ఆపరేషన్ అయినప్పటికీ డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, నాగపూర్ లాంటి పట్టణాల్లో చేసే ఇలాంటి అరుదైన ఆపరేషన్లతో పాటు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్ జిల్లాల పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.