మట్టి గణపతులనే పూజిద్దాం- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
చిత్రం న్యూస్, బోథ్: వినాయక చవితి సందర్బంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విత్తన గణపతిని ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ.. విత్తన గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామాన్నారు. విత్తన గణపతులను పూజలు చేసిన అనంతరం ఇంటి ఆవరణలో నిమజ్జనం చెయ్యాలన్నారు. ఇలా చేస్తే విత్తన గణపతి నుండి ఒక మొక్క మొలుస్తుందని, ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను ప్రతిష్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువకులు గాడ్గే దీపక్, ధీరజ్ తదితరులు ఉన్నారు.