సీఎం చంద్ర బాబుకు వల్లభ స్వామి వారి చిత్రపటం అందజేస్తున్న రేలంగి వెంకట్రావు
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర_స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా వచ్చిన సీఎం నారా చంద్ర బాబు నాయుడుని స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పతో కలిసి పెద్దాపురం ఐటీడీపీ అధ్యక్షులు, మార్కెట్ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. తొలి తిరుపతిలో వెలసిన శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయ చరిత్రను సీఎం కు వివరించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని, మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని, సహకరించాలని సీఎంకి విన్నవించారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.