అధికారిక లాంచనాలతో ఆర్మీ జవాన్ అంతక్రియలు
చిత్రం న్యూస్, భైంసా, ముథోల్: అధికార లాంచనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. గత నాలుగు రోజుల కింద న్యూఢిల్లీలోని దేశ వైమానిక దళాల్లో పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడ వాసి లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ {25} వాటర్ పాల్ లో పడి మృతిచెందారు. శనివారం అతని అంత్యక్రియలు స్వగ్రామంలో అధికారిక లాంచనాలతో పూర్తయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి ప్రవీణ్ సింగ్ జవాన్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు జరిగాయి. ఇక చివరి చూపు కొరకు మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముథోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్, సీఐ మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సిస్ తది
తరులు పాల్గొన్నారు.